ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్‌’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!

- November 25, 2026 , by Maagulf
ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్‌’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!

దోహా: బరువు తగ్గించే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ‘హూడియా గోర్డోని (Hoodia Gordonii)’ ఉత్పత్తిలో ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) గుర్తించింది. సాధారణంగా ‘కాక్టస్ పిల్స్‌ (Cactus Pills)’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఉత్పత్తిలో ఆరోగ్యానికి హాని కలిగించే సిబుట్రామైన్ (Sibutramine) ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయింది.

ఖతార్‌లో ఈ ఉత్పత్తికి అధికారిక రిజిస్ట్రేషన్ లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఔషధాల నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల అనంతరం దీనిని నకిలీ ఉత్పత్తిగా వర్గీకరించింది. దీనిని ఉపయోగించడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ ఉత్పత్తిని ప్రచారం చేస్తున్నవారు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నియంత్రణ చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com