టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- March 04, 2026
తిరుమల: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ కోర్టులో భారీ ఊరట లభించింది. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తనపై ఎలాంటి ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ప్రసారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కోర్టు స్పష్టంగా ఆదేశించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్లు వివరించారు. ఇదే సమయంలో గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం సంబంధిత కంటెంట్‌ను తమ సైట్ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినట్లు నాయుడు పేర్కొన్నారు.
తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. “సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్









