ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- March 04, 2026
దోహా: ఖతార్ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. పటిష్టమైన ట్రాకింగ్ కార్యకలాపాల ఫలితంగా పది మంది అనుమానితులను అరెస్టు చేశామని, వారిలో ఏడుగురు కీలకమైన సైనిక మౌలిక సదుపాయాల సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.మిగితా ముగ్గురు విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు డ్రోన్ల వాడకంలో శిక్షణ పొందారని మంత్రిత్వశాఖ తెలిపింది.
అనుమానితుల వద్ద నుంచి సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తు సమయంలో, అనుమానితులు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్‌తో తమకున్న సంబంధాలను అంగీకరించారు. గూఢచర్యం మరియు విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి వారిని నియమించినట్లు పేర్కొన్నారు. పౌరులు మరియు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని మరియు ఏవైనా అనుమానిత కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే అధికార సంస్థలకు నివేదించాలని అంతర్గత మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







