యుద్ధం పై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన
- March 09, 2026
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభ వేదికగా కీలక వివరణ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం సమీక్షిస్తున్నారని జైశంకర్ వెల్లడించారు. ప్రపంచ దేశాల అధినేతలతో ప్రధాని నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను అడ్డుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం అత్యంత నిబద్ధతతో ఉందని జైశంకర్ భరోసా ఇచ్చారు. ప్రతి భారతీయుడిని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలపై పడే ప్రభావాన్ని కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆయన వెల్లడించారు. జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయినప్పటికీ, ప్రతిపక్షాల నినాదాల మధ్యే మంత్రి జైశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగించి, దేశ విదేశాంగ విధానం మరియు ప్రస్తుత పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









