నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!

- March 17, 2026 , by Maagulf
నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!

రియాద్ః నివాస మరియు కార్మిక నిబంధనలను ఉల్లంఘించేవారిని ఆశ్రయం కల్పించే లేదా సహాయం చేసే వ్యక్తులు SR100,000 వరకు జరిమానా మరియు ఆరు నెలల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఇక విదేశీ పౌరుడైతే శిక్ష అనంతరం బహిష్కరణ కూడా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాస, కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించేవారికి ఏ రూపంలోనైనా సహాయం అందించే ఎవరికైనా జరిమానాలు వర్తిస్తాయని అధికారులు చెప్పారు. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 కు లేదా రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో 999 కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com