అల్ తుమామా స్టేడియం ఇంటర్‌చేంజ్ రోడ్ మూసివేత..!!

- March 17, 2026 , by Maagulf
అల్ తుమామా స్టేడియం ఇంటర్‌చేంజ్ రోడ్ మూసివేత..!!

దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్‌లోని అల్ తుమామా స్టేడియం ఇంటర్‌చేంజ్ వద్ద తాత్కాలిక రహదారి మూసివేతను ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. దీంతో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మెసాయిద్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ప్రభావితం అవుతుందని పేర్కొంది.

అష్ఘల్ ప్రకారం, అవసరమైన నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత మార్చి 20 మరియు 21 తేదీలలో ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు, మొత్తం ఎనిమిది గంటల పాటు కొనసాగుతుంది.   

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌ సమన్వయంతో ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూసివేత సమయంలో, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సబా అల్ అహ్మద్ కారిడార్ మీదుగా ఉత్తరం వైపు ప్రయాణించే వాహనదారులు, సమీపంలోని ఇంటర్‌చేంజ్ లను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలతోకూడిన మ్యాప్ ను విడుదల చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com