న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- March 17, 2026
రియాద్: ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధాన్ని సౌదీ నాయకత్వం ప్రోత్సహిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన నివేదికను ఒక సౌదీ వర్గం ఖండించింది.ఆ నివేదిక అవాస్తవమని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్‌ను కఠినంగా దెబ్బతీయడం కొనసాగించాలని సలహా ఇచ్చారని ది న్యూయార్క్ టైమ్స్ ఆదివారం నివేదించింది.
ఈ నెల ప్రారంభంలో, ఇరాన్ పై దాడి చేయమని సౌదీ అరేబియా ట్రంప్‌పై రహస్యంగా ఒత్తిడి తెస్తోందని ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన నివేదికను వాషింగ్టన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం కూడా తిరస్కరించింది.
ఈ ప్రాంతంలో సైనిక ఘర్షణను నివారించడానికి కృషి చేస్తున్న గల్ఫ్ దేశాలలో సౌదీ అరేబియా ఒకటని.. అలాగే, భవిష్యత్తులో జరగబోయే ఏ యుద్ధంలోనూ తాము పాల్గొనబోమని బహిరంగంగా ప్రకటించింది సౌదీ అరేబియా.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









