ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- March 18, 2026
ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. గత 18 సీజన్లలో ఎందరో దిగ్గజాలు తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించారు. భారత్‌కు చెందిన ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ల రాకతో ప్రస్తుతం దేశంలో సందడి వాతావరణం నెలకొంది. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు.. ఫ్రాంఛైజీ శిబిరంలోకి చేరుతున్నారు. అయితే ఇప్పటివరకు 18 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక రన్స్ ఎవరు చేశారో.. ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్లో అత్యధిక రన్స్ చేసి టాప్-10 ఆటగాళ్లు ఎవరంటే..
- విరాట్ కోహ్లీ – 8,661 రన్స్ (259 ఇన్నింగ్స్‌లు)
- రోహిత్ శర్మ – 7,046 పరుగులు (267 ఇన్నింగ్స్‌లు)
- శిఖర్ ధావన్ – 6,769 రన్స్ (221 ఇన్నింగ్స్‌లు)
- డేవిడ్ వార్నర్ – 6,565 పరుగులు (184 ఇన్నింగ్స్‌లు)
- సురేశ్ రైనా – 5,528 రన్స్ (200 ఇన్నింగ్స్‌లు)
- ఎంఎస్ ధోనీ – 5,439 పరుగులు (242 ఇన్నింగ్స్‌లు)
- కేఎల్ రాహుల్ – 5,222 రన్స్ (136 ఇన్నింగ్స్‌లు)
- ఏబీ డివిలియర్స్ – 5,162 పరుగులు (170 ఇన్నింగ్స్‌లు)
- అజింక్య రహానే – 5,032 రన్స్ (183 ఇన్నింగ్స్‌లు)
- క్రిస్ గేల్ – 4,965 పరుగులు (141 ఇన్నింగ్స్‌లు)
ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాబిన్ ఉతప్ప (4,952 రన్స్), దినేశ్ కార్తిక్ (4,842 రన్స్), ఫాఫ్ డుప్లెసిస్ (4,773 రన్స్), సంజూ శాంసన్ (4,704 పరుగులు), అంబటి రాయుడు (4,348 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (4,311 రన్స్) ఉన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









