సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- March 21, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలో 88 రోజులు, 23 గంటలు, 41 నిమిషాల పాటు కొనసాగిన వింటర్ సీజన్ ముగిసింది. అధికారికంగా మార్చి 20న స్ప్రింగ్ సీజన్ ప్రారంభమైందని జెడ్డా ఖగోళ సొసైటీ అధ్యక్షుడు మజేద్ అబు జహ్రా తెలిపారు. మక్కా కాలమానం ప్రకారం సాయంత్రం 5:46 గంటలకు ఖగోళ లెక్కల ప్రకారం స్ప్రింగ్ సీజన్ ప్రారంభమైందన్నారు.
ఈ సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడని, దక్షిణం నుండి ఉత్తరానికి ఖగోళ భూమధ్యరేఖను దాటుతున్నట్లు కనిపిస్తాడని, దాని కాంతి ఉత్తర, దక్షిణార్ధగోళాల మధ్య దాదాపు సమానంగా ఉంటుందని ఉంటుందని ఆయన వివరించారు.
ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయని, అయితే పగటి సమయం కొన్ని నిమిషాలు ఎక్కువగా ఉంటుందని అబు జహ్రా పేర్కొన్నారు. ఆ రోజున సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయించి, సరిగ్గా పశ్చిమాన అస్తమిస్తాడని, ఇలాంటిది సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే సంభవిస్తుందని ఆయన తెలిపారు.
జూన్ 21న సమ్మర్ సీజన్ ప్రారంభమయ్యే వరకు, అంటే సుమారు 92 పగళ్ళు, 17 గంటల 40 నిమిషాల పాటు స్ప్రింగ్ సీజన్ కొనసాగుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







