పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- November 20, 2026
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఆమె పిఠాపురం పరిధిలోని అగ్రహారంలో నూతనంగా నిర్మించిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అపోలో ఫౌండేషన్ చేపట్టిన ‘అపోలో ఆరంభ్’ ప్రాజెక్టులో భాగంగా, కొణిదెల కుటుంబ సహకారంతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
పవన్ కల్యాణ్ ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారు: ఉపాసన కొణిదెల
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజన్‌ను ఉపాసన కొణిదెల ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల్లో పవన్ కల్యాణ్ ‘పవర్ స్టార్’గా సుపరిచితులైనప్పటికీ, పిఠాపురంలో ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, సాధికారత కార్యక్రమాలను చూసిన తర్వాత తనకు ఆయన ‘ఎంపవర్ స్టార్’గా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి, రుణాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుతో విద్యార్థినుల సాధికారతకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అపోలో ఫౌండేషన్ 109 మోడల్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి కేంద్రాన్ని పిఠాపురంలో ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం స్థానిక తల్లులు, చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసన
- దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..13 నెలల కనిష్ఠానికి ధర..!!
- KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!
- UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!
- కువైట్‌లో 494 భవనాలు కూల్చివేత.. ఆదేశాలు జారీ..!!
- బహ్రెయిన్‌లో ‘సెలబ్రేట్ బహ్రెయిన్ 2026’..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఘనంగా ప్రారంభం..!!
- అబుదాబీ ఇంటర్నేషనల్ బోట్ షో 2026కు భారీ స్పందన..
- విశాఖకు మరో ఐటీ కిరీటం..‘బే-టెక్ సిటీ’ నిర్మాణానికి సీఎం ఆదేశం
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!!







