వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్‌లోడ్.. కొత్త సర్వీస్!
- March 21, 2026
న్యూ ఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరియు MyGov సంయుక్తంగా ఆధార్ వినియోగదారులకు ఒక తీపి కబురు అందించాయి. ఇకపై మీ ఆధార్ కార్డును ఫిజికల్ కాపీగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయాల్లో మీ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
కావాల్సిన అర్హతలు
ఈ సేవను పొందడానికి వినియోగదారుల వద్ద ఈ క్రింది వివరాలు ఉండాలి:
- మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి.
- మీకు యాక్టివ్ డిజిలాకర్ (DigiLocker) ఖాతా ఉండాలి.
- మీ 12 అంకెల ఆధార్ నంబర్ తెలిసి ఉండాలి.
డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- మొదట మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ +91-90131-51515 ను సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.
- అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘డిజిలాకర్ సేవలు’ (DigiLocker Services) ను ఎంచుకోండి.
- ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ధృవీకరించిన వెంటనే, మీ ఇ-ఆధార్ PDF రూపంలో మీకు అందుతుంది.
ఈ సేవ పూర్తిగా ఉచితం మాత్రమే కాదు, చట్టబద్ధంగా అన్ని చోట్లా ఒరిజినల్ ఆధార్ లాగే చెల్లుబాటు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







