ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- March 22, 2026
న్యూ ఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు అధికార పీఠంపై కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వరుస విజయాలు సాధిస్తూ నేడు ఈ ఘనతను అందుకున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ కాలంతో సహా మొత్తం 8,931 రోజులు ఆయన పదవిలో కొనసాగారు. ఇంతకుముందు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది, ఆయన 8,930 రోజులు సీఎంగా పనిచేశారు. నేటితో మోదీ ఈ రికార్డును అధిగమించారు.
నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2014 మే 21 వరకు, దాదాపు 13 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగి, గుజరాత్‌కు అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా నిలిచారు. అనంతరం 2014 మే 26న 14వ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా, వరుసగా 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతగా ఆయనకు పలు రికార్డులు ఉన్నాయి. పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా, రెండు పూర్తి పదవీకాలాలు పూర్తిచేసి మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా ఆయన ఘనత సాధించారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









