గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- March 22, 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల వల్ల అమెరికా సైన్యం ఊహించని రీతిలో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి రెండు వారాల్లోనే గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడుల కారణంగా సుమారు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,700 కోట్లు) నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC) మరియు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) తమ నివేదికల్లో వెల్లడించాయి.
ఈ దాడుల్లో అత్యధిక నష్టం జోర్డాన్‌లోని అమెరికా సైనిక బేస్‌కు వాటిల్లింది. ఇక్కడ అత్యాధునికమైన రాడార్ వ్యవస్థ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడంతో, అది తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఒక్క రాడార్ వ్యవస్థ విలువే దాదాపు 485 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన ఈ పరికరాలు ధ్వంసం కావడం ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
జోర్డాన్‌తో పాటు కువైట్, ఖతార్ మరియు సౌదీ అరేబియాలోని అమెరికా నియంత్రణలో ఉన్న విమానాశ్రయాలు, అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలపైన కూడా దాడులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 310 మిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీయడం ద్వారా ఇరాన్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని సంక్షోభాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







