జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- March 22, 2026
బెర్లిన్: ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలో బహ్రెయిన్ రాయబారి అయిన అహ్మద్ ఇబ్రహీం అల్ ఖరైనీస్.. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ విదేశాంగ మంత్రి డాక్టర్ జోహన్ వాడేఫుల్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో గల్ఫ్ సహకార మండలి మరియు హషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాయబారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో GCC దేశాలు మరియు అనేక అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపుతున్న దాడులను జర్మనీ గట్టిగా ఖండించింనందుకు రాయబారులు తమ ప్రశంసలను వ్యక్తం చేశారు. ఈ దాడులు పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు మరియు చమురు, గ్యాస్ సౌకర్యాలపై జరిగాయని వారు పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ బెదిరింపులను తిరస్కరిస్తూ జర్మనీ తీసుకున్న వైఖరిని రాయబారులు స్వాగతించారు. అటువంటి చర్యలు సముద్ర చట్టంతో సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తాయని వారు చెప్పారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఆమోదించినందుకు జర్మనీని రాయబారులు ప్రశంసించారు. ఈ చర్య గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలకు బెర్లిన్ మద్దతును, అలాగే ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వారు హైలైట్ చేశారు.
ప్రాంతవ్యాప్తంగా భద్రత మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి నిరంతర సమన్వయం , సహకారం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు తెలియజేశాయి. తాజా ప్రాంతీయ పరిణామాలపై కూడా వురు సమీక్షఇంచారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









