వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!

- March 22, 2026 , by Maagulf
వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!

దోహా: వాహన శబ్ద స్థాయిలకు సంబంధించిన నిబంధనలను పాటించాలని వాహనదారులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) పిలుపునిచ్చింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన పోస్ట్ చేసింది.కార్లు మరియు మోటార్‌సైకిళ్లతో సహా అన్ని రకాల వాహనాలు ఒకే రకమైన శబ్ద నిబంధనలకు లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఖతార్ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం, అన్ని రకాల వాహనాలకు గరిష్టంగా అనుమతించదగిన శబ్ద స్థాయి 79 డెసిబెల్స్‌కు మించకూడదని స్పష్టం చేసింది.  ఇక, అధిక పనితీరు గల మరియు స్పోర్ట్స్ వాహనాలకు ఈ పరిమితుల నుండి మినహాయింపు లేదని, వాటి సౌండ్ పరిమితి కూడా నిర్దేశించిన పరిమితులను మించకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

అనుమతించబడిన పరిమితిని మించడం, లేదా ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను మార్చడం లేదా మఫ్లర్‌ను తొలగించడం, లేదా ధ్వనిని పెంచే ప్రోగ్రామ్‌ను పాటించడం వంటి మార్పులు చేయడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 వాహనాల శబ్ద కాలుష్యాన్ని అరికట్టడం మరియు  ప్రజా భద్రతను ప్రోత్సహించే, సమాజ ప్రశాంతతను కాపాడే విధంగా చట్టాలు, నిబంధనలకు వాహనదారులు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com