ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- March 22, 2026
యూఏఈ: యూఏఈ మరియు ఇతర అరబ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్నది. జరిగిన దాడుల నేపథ్యంలో మిడిలీస్టు అంతటా తీవ్రమవుతున్న ఘర్షణలు ప్రజారోగ్యానికి, భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ హెచ్చరించారు.
ఈ మేరకు Xలో పోస్ట్ ఒక ప్రకటన చేశారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ -జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్, జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ శాశ్వత ప్రతినిధి అయిన అంబాసిడర్ జమాల్ అల్ ముషారఖ్తో తాను సమావేశం జరిపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో యూఏఈ, ప్రాంతం అంతటా తీవ్రమవుతున్న ఘర్షణల వల్ల కలిగే విస్తృత ఆరోగ్య ప్రభావాలపై వారు చర్చించారు.
సౌదీ అరేబియాతో సహా ఈ ప్రాంతమంతటా ఇంధన కేంద్రాలపై దాడులు జరిగాయి. అటువంటి ప్రదేశాలపై జరిగే దాడుల వల్ల, మంటల నుండి వెలువడే విషపూరిత పొగను పీల్చడం వలన శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చనే ఆందోళనలు ఎమిరేట్స్ లో మరియు ఈ ప్రాంతమంతటా పెరుగుతున్నాయి. "ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్లకు జరిగిన నష్టం నీటి సరఫరాకు కూడా ముప్పు కలిగిస్తోంది. అదే సమయంలో, బాంబు దాడుల ప్రమాదం మధ్య జీవించడం వల్ల కలిగే ఒత్తిడిని ప్రజలు ఎదుర్కొంటున్నందున, వారి మానసిక ఆరోగ్యంపై కూడా భారం పెరుగుతోంది." అని గెబ్రియేసస్ అన్నారు. ఇలాంటి చర్యలను డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
"మిడిలీస్టు, ఆఫ్రికా మరియు ఆసియా అంతటా వైద్య సామాగ్రిని అందించడంలో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీస్ లాజిస్టిక్స్ హబ్ పోషిస్తున్న ప్రాణరక్షక పాత్రను రాయబారి అల్ ముషారఖ్ కొనియాడారు." అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, సంఘర్షణల వల్ల ప్రభావితమైన ప్రజలందరి ఆరోగ్యం కాపాడటానికి, శారీరక మరియు మానసిక ఆరోగ్య సవాళ్లతో పాటు ఇతర సంక్షోభాల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించే చర్యలను బలోపేతం చేయాల్సిన తక్షణ అవసరం ఉందని వివరించారు. "శాంతియే ఉత్తమ ఔషధం" అని డబ్ల్యూహెచ్ఓ అధిపతి అన్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









