సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- March 23, 2026
రియాద్ః సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఈ సమయంలో బలమైన గాలులు, విజిబిలిటీ తగ్గుతుందని, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలెర్టులను జారీ చేసింది.
రియాద్ ప్రాంతంలోని అల్-అఫ్లాజ్, అల్-ఖర్జ్, అల్-దలామ్, అల్-హారిక్, అల్-ముజాహిమియా మరియు హవ్తత్ బని తమీమ్ వంటి ప్రాంతాలతో పాటు, అల్-సులయిల్ మరియు వాడి అల్-దవాసిర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో తూర్పు ప్రావిన్స్, అసిర్, నజ్రాన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి.
అలాగే దిరియా, రాజధాని రియాద్, రుమా మరియు దుర్మాతో సహా రియాద్, అల్-సులయ్యిల్ మరియు వాడి అల్-దవాసిర్, అల్-ఖఫ్జీ, అల్-నైరియా మరియు ఖర్యాత్ అల్-ఉల్యా, రఫా, ఉత్తర సరిహద్దుల ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్టును జారీ చేశారు. ఈ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతోపాటు వరదలు సంభవించే అవకాశం ఉందని జాతీయ వాతావరణ మండలి (NCM) సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







