రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్‌వేస్ కీలక ప్రకటన..!!
- March 23, 2026
దోహా: రీఫండ్ అభ్యర్థనలను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది. అయితే, ప్రస్తుతం విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో రీఫండ్‌లకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపింది.ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీని కలిగి ఉండి, తమ బుకింగ్‌లు నిర్ధారించబడిన వినియోగదారులు రీఫండ్ లేదా ప్రయాణ తేదీ మార్పుకు అర్హులని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. రీఫండ్‌లు అందడానికి 28 పని దినాల వరకు సమయం పట్టవచ్చని, రీఫండ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత దాని స్థితిని తెలుసుకోవడానికి తమ ఈమెయిల్‌ను తనిఖీ చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం, తాజా అప్డేట్ ల కోసం తమ అధికారిక వెబ్ సైట్ ను ఫాలో కావాలని సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







