సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- March 23, 2026
న్యూ ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థల వేసవి విమాన సర్వీసుల షెడ్యూల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్‌ను సరిచూసుకోవాలని సూచించింది. అలాగే కార్యాచరణ అత్యవసర పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో విమాన షెడ్యూల్‌లో మార్పులు జరిగితే ఆయా విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరింది. ఈ మేరకు మార్చి 29 నుంచి అక్టోబర్ 24 వరకు వర్తించే దేశీయ విమాన సర్వీసుల సమ్మర్ షెడ్యూల్‌ను సోమవారం రిలీజ్ చేసింది.
దేశీయ విమాన ఛార్జీలపై విధించిన తాత్కాలిక పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం మార్చి 23 (సోమవారం) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వం విధించిన ఈ పరిమితులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. విమాన టికెట్ల ధరలపై పరిమితులు ఇకపై అవసరం లేదని తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ఉత్తర్వును ఆదివారం జారీ చేసింది. కాగా, ఈ నిర్ణయం మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విమాన టికెట్ ధరలను నిర్ణయించుకోవడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తుంది. “ఇండిగో విమాన సర్వీసులకు భారీ స్థాయిలో అంతరాయం కలగడం వల్ల టికెట్ల ధరలలో తలెత్తే అసాధారణ పెరుగుదలను అరికట్టేందుకు గతేడాది డిసెంబరు 6న విమాన ఛార్జీలపై తాత్కాలిక పరిమితులు విధించాం అని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







