వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- March 29, 2026
మస్కట్: అల్ అమెరాత్ విలాయత్‌లోని వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ట్రాఫిక్‌ను రెండు లేన్‌లకు మళ్లించారు. ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించడానికి, వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి సంబంధిత బృందాలు చర్యలుచ చేపట్టాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని, సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాలకు మాత్రమే అనుమతి
ప్రస్తుత పరిస్థితుల కారణంగా అల్ బురైమీ నుండి అల్ ఫే వైపు వచ్చేవారికి రహదారి ప్రస్తుతం ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాలకు మాత్రమే తెరిచి ఉందని రవాణా, సమాచార మరియు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అల్ ఫే–అల్ వజాజా రహదారిని తిరిగి తెరిచేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీలైనంత త్వరగా సాధారణ ట్రాఫిక్ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్వహణ మరియు పునఃప్రారంభ పనులు పూర్తయ్యే వరకు, వాహనదారులందరూ అత్యంత జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని, ఆ ప్రాంతానికి చేరుతున్నప్పుడు వేగాన్ని తగ్గించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







