ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- March 29, 2026
కువైట్ః కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడి అనంతరం, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకులలో చెలరేగిన భారీ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు 58 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించాయి. ఇటీవలి కాలంలో అత్యంత సుదీర్ఘ ఆపరేషన్ ఇదని అగ్నిమాపక శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు అధికారిక ప్రతినిధి అయిన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అల్-ఘరీబ్ తెలిపారు. శత్రు డ్రోన్లు దాడి కారణంగా ఇంధన నిల్వ కేంద్రాలలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు.
అధికారుల ప్రకారం, ఈ ఘటనలో గణనీయమైన నష్టం వాటిల్లినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సిబ్బంది నిరంతరం సంఘటనా స్థలంలోనే ఉండి, మంటలు మరింతగా వ్యాపించకుండా నిరోధించడానికి మరియు చుట్టుపక్కల సౌకర్యాలను సురక్షితంగా ఉంచడానికి తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







