హైదరాబాద్ లో భానుడి భగభగలు
- March 29, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌లో వేసవి సెగలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా ఉంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం కేవలం 23% కి పడిపోవడంతో వాతావరణం పొడిగా మారి, నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నాటికి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 39 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మార్చి 30, 31 తేదీల్లో నగరంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ వర్షం కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని, ఎండల తీవ్రత మాత్రం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. వర్షం తర్వాత భూమి నుంచి వచ్చే ఆవిరి వల్ల ఉక్కపోత మరింత పెరిగే ప్రమాదం ఉంది.
41 డిగ్రీల వరకు..
నిజమైన వేసవి తాపం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలుకానుంది. వచ్చే నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు 38 నుండి 41 డిగ్రీల మధ్య నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







