అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- March 31, 2026
రియాద్ః లైసెన్స్ లేని బరువు తగ్గించే మందులు, హార్మోన్ల డ్రగ్స్ మరియు పెప్టైడ్ పదార్థాలను విక్రయించినందుకు ప్రచారం చేసినందుకు అరబ్ జాతీయతలకు చెందిన పలువురు జిమ్ ట్రైనర్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాను పర్యవేక్షించడం ద్వారా ఈ ఉల్లంఘనలను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) మరియు ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది.
ఒక స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఓ వేర్ హౌజ్ లో హార్మోన్ల సప్లిమెంట్లు, పెప్టైడ్ పదార్థాలు మరియు రెటాట్రూటైడ్ అనే పదార్థాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెటాట్రూటైడ్ అనేది ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉందని, దీనికి నిర్ధారిత సేఫ్టీ రికార్డు కూడా లేదన్నారు. ఆరోగ్య సంరక్షణ వృత్తుల చట్టం ప్రకారం, ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధించబడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
జిమ్‌లు మరియు క్రీడా కేంద్రాలు పర్యవేక్షణను పటిష్టం చేయాలని, సిబ్బంది నిబంధనలను పాటించేలా చూడాలని సూచించారు జిమ్‌కు వెళ్లేవారు ఆరోగ్య ఉత్పత్తులను లైసెన్స్ పొందిన సంస్థల నుండి, వైద్య పర్యవేక్షణలో మాత్రమే పొందాలని, సోషల్ మీడియాలో ప్రచారం చేసే ధృవీకరించని ఉత్పత్తులకు దూరంగా ఉండాలని కూడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఉల్లంఘనలను గురించిన సమాచారాన్ని 937 నంబర్‌లో ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







