ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- April 04, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి
దేవాలయ అభివృద్ధి పనుల పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయమవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్‌లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని...పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని...ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాలన్నారు.అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సమీక్షలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల..
- భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం
- లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో తొక్కించి హత్య!
- యూఏఈలో ఉద్యోగం మారుతున్నారా?బ్యాన్ పడకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి!
- భారతదేశంలోనే పొడవైన నాన్‌స్టాప్ రూట్ కలిగిన టాప్-2 రైళ్లు ఇవే!









