మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- April 05, 2026
దోహా: షాపింగ్ మాల్స్ పార్కింగ్ ప్రాంతాల్లో గాలి నాణ్యత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితంగా ఉందని పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) తెలిపింది.ఈ పార్కింగ్ ప్రాంతాలలో గాలి నాణ్యత ఫలితాలు పరిమితుల్లోనే ఉన్నాయని, గల్ఫ్ లేదా అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాల ఉల్లంఘనలు ఏవీ లేవని పేర్కొంది. సురక్షితమైన ఇండోర్ వాతావరణాన్ని అందివ్వడం మరియు ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తన X ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో వివరించింది.
27 సంస్థల భాగస్వామ్యంతో అమలు చేయబడిన ఈ కార్యక్రమం.. ఉష్ణోగ్రత తోపాటు కార్బన్ మోనాక్సైడ్ (CO), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2), సల్ఫర్ డయాక్సైడ్ (SO2), పార్టిక్యులేట్ మ్యాటర్ (PM10 మరియు PM2.5) వంటి అనేక కీలక రీడింగ్స్ ద్వారా గాలి నాణ్యతను పరిక్షించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో నిరంతరాయంగా పనిచేయడం కారణంగా షెడ్యూల్ లో పేర్కొన్న 60 రోజులకు బదులుగా 42 రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







