ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- April 07, 2026
దుబాయ్ః కొనసాగుతున్న ప్రాంతీయ సంఘర్షణ వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని దుబాయ్‌లోని ఒక స్కూల్ ప్రకటించింది. వరుసగా మూడో ఏడాది కూడా స్కూల్ ఫీజులను పెంచకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) నుండి గతంలో అనుమతి పొందినప్పటికీ, స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ దుబాయ్ రాబోయే విద్యా సంవత్సరానికి ట్యూషన్ ఫీజులను పెంచబోమని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో పాఠశాలలో వరుసగా మూడవ సంవత్సరం కూడా ఫీజులు స్థిరంగా ఉంటాయని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ దుబాయ్ మేనేజింగ్ డైరెక్టర్ జుబేర్ అహ్మద్ తెలిపారు. ఈ నిర్ణయం పాఠశాల కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపినప్పటికీ, తాము మా మాటకు గట్టిగా కట్టుబడి, తల్లిదండ్రులకు ఊరటనిచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మరోవైపు, యూఏఈ వ్యాప్తంగా ఉన్న భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించాయి.
సౌకర్యవంతమైన నెలవారీ ఫీజు వాయిదాలు
ఫీజులను ఫ్రీజ్ చేయడమే కాకుండా కుటుంబాలపై రోజువారీ ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించే లక్ష్యంతో పాఠశాల అనేక చర్యలను ప్రవేశపెట్టింది. అనేక కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లను గుర్తించి, ప్రస్తుత ఫీజు విధానాన్ని కొనసాగించాలని బోర్డు తీర్మానించింది. ఫీజు చెల్లింపుల కోసం పాఠశాల సౌకర్యవంతమైన నెలవారీ వాయిదాల విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఉచిత రవాణా
అలాగే, రవాణా సహాయం ద్వారా ఆచరణాత్మక మద్దతును ప్రకటించారు. “కుటుంబాలపై భారాన్ని తగ్గించడానికి, ఎంపిక చేసిన కమ్యూనిటీలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించబడింది. తద్వారా ఆర్థిక సహాయంతో పాటు ఆచరణాత్మక మద్దతు కూడా అందేలా చూస్తున్నాము.భవిష్యత్తులో, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, స్ప్రింగ్‌డేల్స్ తమ కుటుంబాలకు ఆర్థిక మరియు సామాజిక మద్దతు వంటి అదనపు మార్గాలను అన్వేషించడానికి పూర్తిగా కట్టుబడి ఉంది.” అని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జుబేర్ అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







