సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- April 07, 2026
రియాద్ః సౌదీ అరేబియాలో ప్రైవేట్ రంగంలోని పరిపాలనా సహాయక ఉద్యోగాల సౌదీకరణకు సంబంధించిన నిర్ణయంపై కీలక అప్డేట్ ను మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRSD) ప్రకటించింది. 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాల్లో 100 శాతం లోకలైజ్ చేసినట్లు తెలిపింది.ఈ నిర్ణయం ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
ప్రైవేట్ రంగంలోని ప్రత్యేక వృత్తులను సౌదీకరణ చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఇది భాగం అని తెలిపింది. ప్రైవేట్ రంగ సంస్థలు సౌదీ పౌరులకు ఉద్యోగ అవకాశాలను అందించడం ద్వారా సహాయక కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకాల నుండి ప్రయోజనం పొందుతాయన్నారు.
ఈ నిర్ణయం జారీ అయిన తేదీ నుండి సౌదీకరణ అమలయ్యే వృత్తులను మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. వీటిలో హ్యూమన్ రిసోర్సెస్ క్లర్క్, టైపిస్ట్, స్టోర్‌కీపర్, అనువాదకుడు, బాడీగార్డ్, సెక్యూరిటీ గార్డ్, పేషెంట్ రిసెప్షనిస్ట్, కంప్లైంట్స్ క్లర్క్, హోటల్ రిసెప్షనిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, కస్టమ్స్ బ్రోకర్, లాంగ్వేజ్ స్పెషలిస్ట్, ఇంటర్‌ప్రెటర్, క్యాషియర్, లేబర్ అఫైర్స్ మేనేజర్ మరియు పర్సనల్ మేనేజర్ ఉన్నాయి. మిగిలిన 50 ప్రొఫెషన్లలో సౌదీకరణ కోసం ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ను మంత్రిత్వ శాఖ నిర్దేశించింది.
ఇందులో లేబర్ ఇన్వెస్టిగేటర్, కెరీర్ గైడెన్స్ స్పెషలిస్ట్, కాంపెన్సేషన్ స్పెషలిస్ట్, రిక్రూట్‌మెంట్ స్పెషలిస్ట్, ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ స్పెషలిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, జాబ్ లైజన్ స్పెషలిస్ట్, ప్రోటోకాల్ మేనేజర్, ఫండ్‌రైజింగ్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్, సైబర్‌సెక్యూరిటీ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ మేనేజర్, ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ మేనేజర్, సివిల్ సర్వీస్ ఆఫీస్ మేనేజర్, లేబర్ ఆఫీస్ మేనేజర్, రిక్రూట్‌మెంట్ ఆఫీస్ మేనేజర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, టాలెంట్ మేనేజర్, కాంపెన్సేషన్ మేనేజర్, రిక్రూట్‌మెంట్ మేనేజర్, ఆక్యుపేషనల్ క్లాసిఫికేషన్ మేనేజర్, వర్క్‌ఫోర్స్ ప్లానింగ్ మేనేజర్ మరియు హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







