మొదలైన 'డర్టీగేమ్' షూటింగ్
- August 04, 2016
పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, ఖయ్యుం ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. గురుపౌర్ణమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఆగస్ట్4) నుండి ప్రారంభమైంది.
ఈ సందర్బంగా మూవీలో కీ రోల్ పోషిస్తున్న పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..నటుడు సురేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాజకీయ నేపథ్యంతో నడిచే ఈ చిత్రం చూసి ఒక్క ఎమ్మెల్యే మారినా మా ప్రొడ్యూసర్ మనోహర్ జీవితం ధన్యమైనట్లే. కథ అంత చక్కగా కుదిరింది...అని అన్నారు.
నటుడు సురేష్ మాట్లాడుతూ..మా ప్రొడ్యూసర్ మనోహర్ గారిని చూడగానే బ్రదర్‌లా అనిపించారు. రియాలిటీకి దగ్గరగా ఈ కథ ఉంటుంది. మంచి టీమ్‌తో ఈ కథ తెరకెక్కుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.
చిత్ర నిర్మాత తాడి మనోహర్ కుమార్ మాట్లాడుతూ..నాకు సినీ రంగంతో పెద్దగా పరిచయం లేదు. కానీ నేను నిర్మిస్తున్న నా తొలి సినిమాకే సీనియర్ నటులతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. రాజకీయ నేపథ్యంతో మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు సంతోహంగా ఉంది...అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటీమణి రాజీనాయర్, ఖయ్యుం, చిత్ర దర్శకులు అక్కిపెద్ది వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, సురేష్, ఖయ్యుం, అస్మిత, రమ్య, తాడి మనోహర్ నాయుడు, జబర్ధస్త్ టీమ్ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: తాడి మనోహర్ కుమార్, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







