ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- April 10, 2026
రియాద్: ఏప్రిల్ 11 నుండి దుబాయ్, అబుదాబి మరియు అమ్మన్లకు తన విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సౌదియా ప్రకటించింది.
ఈ కింది మార్గాల్లో రోజువారీగా కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.
దుబాయ్ (DXB): SV588 — జెడ్డా నుండి దుబాయ్; SV589 — దుబాయ్ నుండి జెడ్డా.
అబుదాబి (AUH): SV570 — జెడ్డా నుండి అబుదాబి; SV571 — అబుదాబి నుండి జెడ్డా.
అమ్మన్ (AMM): SV631 — జెడ్డా నుండి అమ్మన్; SV632 — అమ్మన్ నుండి జెడ్డా.
విమానాశ్రయానికి బయలుదేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్థితిని (status) సరిచూసుకోవాలని ఎయిర్లైన్స్ సూచించింది. మిడిలీస్టులో యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుండి సౌదియా తన విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







