సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- April 11, 2026
రియాద్ః సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అసిర్, జాజాన్, నజ్రాన్, అల్-బాహా, మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్ మరియు ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ప్రజలు తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా వేదికలు మరియు 'అన్వా' (Anwaa) యాప్ ద్వారా అధికారిక వాతావరణ తాజా సమాచారం మరియు హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు మరియు లోయలకు దూరంగా ఉండాలని, అలాగే వాటిలో ఈత కొట్టవద్దని పౌర రక్షణ విభాగం (General Directorate of Civil Defense) విజ్ఞప్తి చేసింది. ఈ వాతావరణ పరిస్థితుల సమయంలో భద్రతా సూచనలను తప్పక పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







