సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- April 16, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఈ వీకెండ్ (ఆదివారం) వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) హెచ్చరించింది.
ఈ ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దుమ్ము మరియు ఇసుకతో కూడిన బలమైన గాలులు (downdrafts) వీస్తాయని తెలిపింది. దీనితోపాటు వడగళ్లు, ఆకస్మిక వరదలు మరియు తీరప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
రియాద్ పరిధిలోని గవర్నరేట్లపై ప్రభావం వర్ష ప్రభావం ఉంటుందని, అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని NCM తన వాతావరణ నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల జాబితాలో దిరియా, అల్-ముజాహిమియా, అల్-ఖర్జ్, అల్-దిలామ్, అల్-హారిక్, అల్-రైన్, అల్-ఖిద్దియా, రుమా, అల్-అఫ్లాజ్ మరియు హవ్తత్ బని తమీమ్ ఉన్నాయి.
వీటితో పాటు అల్-మజ్మా, అల్-జుల్ఫీ, అల్-ఘాట్, అల్-ఖువయ్య, అల్-దవాద్మి, అఫీఫ్, షక్రా, థాదిక్, హురైమిలా, ధుర్మా మరియు మరాత్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. వాడి అల్-దవాసిర్ మరియు అస్-సులైయిల్ గవర్నరేట్లలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మక్కా ప్రాంతంలోని కొన్ని భాగాలపై కూడా వర్ష ప్రభావం ఉంటుందని నివేదిక సూచించింది. ముఖ్యంగా తైఫ్, మైసాన్, అధమ్, అల్-అర్దియత్, తురాబా, అల్-మావియా, అల్-ఖుర్మా మరియు రానియా గవర్నరేట్లలో వచ్చే శుక్రవారం వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
అలాగే నార్తర్న్ బోర్డర్స్, అల్-జౌఫ్, తబూక్, మదీనా, హాయిల్ మరియు ఖాసిమ్ ప్రాంతాలకు క్రమంగా వర్షాలు విస్తరిస్తాయని పేర్కొంది. అల్-బాహా ప్రాంతం మరియు దాని పరిధిలోని చాలా గవర్నరేట్లలో వచ్చే ఆదివారం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
అభా, ఖామిస్ ముషైత్, అహద్ రోఫైదా, శరత్ అబిదా, ధహ్రాన్ అల్-జనౌబ్, అల్-హర్జా, బిషా, అల్-నమాస్, తనోమా, రిజల్ అల్మా, బారిక్, మహయిల్ అసిర్, అల్-మజరిదా, బల్కార్న్ మరియు అల్-ఫర్న్, అల్-రైత్, హరూబ్, అల్-డేయర్, అల్-అయదాబి, ఫిఫా, అల్-అర్దా మరియు అల్-హార్త్‌లతో సహా జజాన్ ప్రాంతం కూడా వర్షాల కారణంగా ప్రభావితమవుతుందని తెలిపింది.
NIC తన వెబ్‌సైట్, మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు అన్వా అప్లికేషన్ ద్వారా హెచ్చరికలను ఫాలో కావాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







