సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- April 17, 2026
అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యూకే పర్యటనకు వెళ్లనున్నారు. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి యూరోఫ్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దాదాపు 25రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్ కు అనుమతి ఇచ్చింది. దేశం విడిచి వెళ్లేముందు కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ష్యూరిటీ సీబీఐ అధికారులకు అందజేయాలని కోర్టు సూచించింది.
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్లాలంటే సీబీఐ న్యాయస్థానం అనుమతి తప్పనిసరి. గతంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన పలు సందర్భాల్లో సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. తాజాగా.. యూరోప్, యూకే పర్యటనలకు వెళ్తున్న జగన్.. సీబీఐ కోర్టును అనుమతి తీసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









