తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!

- April 17, 2026 , by Maagulf
తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!

కువైట్: రోగుల భద్రతకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనల నేపథ్యంలో ఒక మెడికల్ సెంటర్ ను మూసివేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవాధి ఆదేశించారు. దానిని మెడికల్ లయబిలిటీ అథారిటీ మరియు సంబంధిత న్యాయ సంస్థలకు రిఫర్ చేశారు.

అధికారుల తనిఖీలలో అనేక కీలక ఉల్లంఘనలు వెల్లడయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతంలో మూసివేసిన ఒక సంస్థకు సంబంధించిన లైసెన్సుతో ఆ మెడికల్ సెంటర్ రన్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

అదే సమయంలో సిబ్బంది వృత్తిపరమైన గుర్తింపులు లైసెన్స్ పొందిన సంస్థతో సరిపోలడం లేదని, కొందరు వ్యక్తులు సరైన వృత్తిపరమైన లైసెన్సులు లేకుండా వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తూ, కన్సల్టేషన్లు అందిస్తున్నారని కూడా అధికారులు తమ తనిఖీలలో గుర్తించారు.  

అలాగే, వైద్య రికార్డులలో సరైన రోగ నిర్ధారణ సహా తీవ్రమైన లోపాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనుమతులు పొందకుండానే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలను నిర్వహించడానికి ఆ కేంద్రం ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ప్రచార ప్రయోజనాల కోసం వేరొక పేరుతో పనిచేస్తున్న ఆమోదం లేని ఎలక్ట్రానిక్ ఖాతాను ఉపయోగించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

రోగుల భద్రతను కాపాడటానికి మరియు వృత్తిపరమైన, చట్టపరమైన ప్రమాణాలను పాటించేలా చూడటానికి వైద్య సంస్థలపై కఠినమైన పర్యవేక్షణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com