‘పిఠాపురంలో…అలా మొదలైంది’ కుటుంబ కథా చిత్రం..
- April 20, 2026
మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ‘పిఠాపురంలో…అలా మొదలైంది’ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది.డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాని మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలో నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం.మురళి (గోదావరి కిట్టయ్య) మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.ఈ క్రమంలో..నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ* .. ‘మా దర్శకుడు జన సేన అభిమాని పార్టీ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆయనది చేబ్రోలు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఇదే ప్రాంతంలో షూటింగ్ చేస్తానని మాటిచ్చారు. అందుకే అక్కడే చిత్రీకరణ చేశాం.దాదాపు 75 శాతం షూటింగ్ అక్కడే చేశాం. హైదరాబాద్, గోవాల్లోనూ కొంత పార్ట్ షూట్ చేశాం.మహేష్ చంద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఆకుల సురేష్ గారితో మహేష్ చంద్ర ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఆ తరువాత మేం జాయిన్ అయ్యాం. భారీ తారాగణంతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఇందులో రాజకీయ అంశాలేవీ ఉండవు. తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం’ అని అన్నారు.
నిర్మాత ఎఫ్.ఎం.మురళి (గోదావరి కిట్టయ్య) మాట్లాడుతూ..‘నేను జర్నలిస్ట్‌గా పిఠాపురంలో పని చేస్తుంటాను. సినిమాలో చూపించే అందమైన గ్రామీణ ఇల్లులానే మా ఇల్లు ఉంటుంది. దర్శకుడు మా ఇంటిని చూసి షూటింగ్‌కి కావాలని అడిగారు.ఒకసారి లీవ్ పెట్టుకుని మరీ షూటింగ్‌ను చూశాను.ఎంతో సహజంగా అనిపించింది. ఆ తరువాత నాకు కథలో భాగం అవ్వాలని అనిపించింది.కారెక్టర్ కాదు..నేను నిర్మాతగా ఇందులో పార్ట్ అవ్వాలని అనుకున్నాను.మహేష్ టేకింగ్ నాకు నచ్చి ఇందులోకి వచ్చాను. ‘ప్రేయసిరావే’ లాంటి గొప్ప మూవీని తీసిన మహేష్ తో వర్క్ చేయడం నా అదృష్టం’ అని అన్నారు.
నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ..మహేష్ చంద్ర తీసిన ‘ప్రేయసి రావే’ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు వినిపించాం.డైరెక్టర్ రైటర్ శ్రీరామ్ ఈ కథ మీద బాగా వర్క్ చేసి అద్భుతంగా డైలాగ్ వర్షెన్, స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. కరోనా వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రెసిడెంట్ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ ని తీసుకున్నాం. ఆయన ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు.మంచి సినిమా తీశామని ఆడియెన్స్ చెబుతారు. ప్రీమియర్‌లో చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మౌత్ టాక్‌తో మా సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంది’ అని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







