కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- April 24, 2026
కరీంనగర్: కరీంనగర్ ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీకగా, పూర్తిగా సహజమైన పండ్లతో తయారు చేసిన 'గజానంద్స్ నాస్టిక్' ఫ్రూట్ పాప్స్ విక్రయ కేంద్రాన్ని కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, గోదాంగడ్డ రోడ్ (వరాహి బాంక్వెట్ హాల్ సమీపంలో) ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై, రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పండ్లతో ఇక్కడ రకరకాల ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ పాప్స్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.షాప్ నిర్వాహకులు సాయినాధ్, సంపత్ మాట్లాడుతూ భాగస్వామ్యంతో ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారులకు మేలైన రుచులను అందిస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవళి, వెంకటేష్, శ్రీమాన్, హరీష్, రమేష్, కిరణ్, రాజేశం, సందీప్, రాజమౌళి తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







