తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- April 24, 2026
హైదరాబాద్: తెలంగాణ మంత్రులతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సానుకూలంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పలు డిమాండ్లకు సర్కార్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై హైలెవల్ కమిటీ నియమించే అవకాశం ఉంది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్







