బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!

- September 20, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!

మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 18, 2026న జరిగిన ఈ కార్యక్రమం.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త ‘సేవా పఖ్వాడా’ వేడుకల్లో భాగంగా జరిగింది.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహ్రెయిన్‌లోని భారతీయ ప్రవాసుల్లో ఐక్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌర బాధ్యతను ప్రోత్సహించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.
రాజీవ్ కుమార్ మిశ్రా, ఛార్జ్ డి అఫైర్స్ నేతృత్వంలో జరిగిన ఈ 3 కిలోమీటర్ల కమ్యూనిటీ రన్‌లో సుమారు 200 మంది భారతీయ ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బహ్రెయిన్‌లోని సంస్కృతి (Samskruthi) సంస్థ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘వికసిత్ భారత్ ప్రతిజ్ఞ’
కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారంతా ‘వికసిత్ భారత్ ప్రతిజ్ఞ’ చేశారు. 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

పార్కులో ‘స్వచ్ఛతా హీ సేవా’
రన్ అనంతరం భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇందులో ప్రవాస భారతీయులు చురుగ్గా పాల్గొని పార్కులో శుభ్రత కార్యక్రమం చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com