‘ది బ్లాక్ గోల్డ్’ 60+ రోజుల్లో పూర్తయిన షూటింగ్
- April 27, 2026
వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-వోల్టేజ్ ప్రాజెక్ట్ , హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగేష్ KMC దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథ మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు.
రిలీజ్ చేసిన తాజా పోస్టర్లో సంయుక్త పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండస్ట్రియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా నిలబడి, చేతిలో గన్ను పట్టుకుని కనిపించడం ద్వారా ఆమె పాత్రలోని అగ్రెషన్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు. మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తిచేయడం విశేషం. ఐదు పవర్ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగింది. మేకింగ్ వీడియోలో ఈ ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించారు, కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించారు.
అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న 'బ్లాక్ గోల్డ్' చిత్రం, సినిమా ప్రేమికులను, నేటి తరం (Gen Z) ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, BVS రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
బ్లాక్ గోల్డ్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాన్-ఇండియన్ విడుదల కానుంది.
తారాగణం: సంయుక్త, మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, BVS రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: యోగేష్ KMC
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: సింధు మాగంటి
డీవోపీ; ఎ వసంత్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
కథ & సంభాషణలు: యోగేష్ KMC & ప్రసాద్ నాయుడు
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి
యాక్షన్: రామ్ కృష్ణ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్‌లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







