'వదలా' సాలిడ్ కాన్సెప్ట్ ఉన్న సినిమా: హీరో జగపతి బాబు
- April 27, 2026
జగపతి బాబు, లయ, ఆకెళ్ల వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ 'వదలా' థ్రిల్లింగ్ టీజర్ లాంచ్
వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్ ని లాంచ్ చేశారు.
యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు. ఆమె కూడా అతనిపై అపారమైన ప్రేమతో, వారి బంధాన్ని ఎవరూ చెడగొట్టకూడదని కోరుకుంటుంది. అయితే, కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక యువతి రాకతో వారి ప్రపంచం తలక్రిందులు అవుతుంది. యోగిపై ఆమెకు ఏర్పడే భావోద్వేగం క్రమంగా వ్యామోహం మారి, అతని ప్రేమను పొందడానికి ఆమె ఎలాంటి హద్దులనైనా దాటడానికి సిద్ధంగా ఉంటుంది.
జగపతి బాబు వయసుకు తగ్గ పాత్రలో ఎంతో సహజంగా ఒదిగిపోయారు. లయ అంకితభావంతో కూడిన భార్యగా నటించింది. వారి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకంగా నిలిచింది.
హృతిక శ్రీనివాస్ ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తోంది. ఆమె పాత్రలో దాగి ఉన్న మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. రవి వర్మ కూడా కీలక పాత్రలో కనిపిస్తూ కథకి మరింత బలం అందించారు.
దర్శకుడు ఆకెళ్ల వి కృష్ణ కథను సస్పెన్స్, డ్రామా ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా మలిచారు. చోటా కె నాయుడు విజువల్స్‌కు గ్రిటీ టోన్ ఇచ్చి థ్రిల్లింగ్ ఫీల్ పెంచగా, కార్తిక్ కొడకండ్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్‌ను నిరంతరం కొనసాగిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కథను కాంపాక్ట్‌గా మలిచింది. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల రైటర్, బజ్జా బ్రహ్మయ్య ప్రొడక్షన్ డిజనర్. మొత్తానికి ‘వదలా' టీజర్ సస్పెన్స్ ఇంటెన్సిటీతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. జీవితంలో అన్నీ జరిగిపోయినట్టే ‘వదలా’ సినిమా కూడా జరిగింది. నిర్మాత కిషోర్ గారు, భరద్వాజ గారితో సినిమా చేయాలని వచ్చారు. అది ఇలా ‘వదలా’గా రూపుదిద్దుకుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్ అందరూ బంగారంలాంటి వారు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఒక థ్రిల్లర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాం. సినిమా చాలా బాగా రావడం ఆనందంగా ఉంది. చోటా కె. నాయుడు గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఆయన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ క్వాలిటీకి ఆయన ప్రధాన కారణం ఆయనే, బంగారంలాంటి సినిమాను మీకు అప్పగిస్తున్నాం. దీన్ని కల్తీ చేయకుండా బాగా చూడాలి (నవ్వుతూ). లయతో ‘మనోహరం’ నుంచి నా జర్నీ ఉంది. ఈ సినిమాలో ఆమె చాలా డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ కాపీ చూసిన నిర్మాత కిషోర్ గారు “ఈ సినిమాను తొందరపడి ఎవరికీ అమ్మొద్దు… ఇది కనీసం 45–50 కోట్లు చేస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అలాంటి విజయం వస్తుందని నమ్ముతున్నాను. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ కావాలంటే ఒక సాలిడ్ ఎలిమెంట్ ఉండాలి. ‘ఓల్డ్ మాన్ – యంగ్ గర్ల్’ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ఇందులో చాలా మంచి ట్విస్టులు ఉంటాయి.
హీరోయిన్ లయ మాట్లాడుతూ: టీజర్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. నటించినప్పుడు కంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా పవర్‌ఫుల్‌గా, డెప్త్ ఉన్న సినిమాలా అనిపించింది. వెంటనే పూర్తి సినిమా చూడాలనిపించింది. జగపతి బాబు గారితో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఏ పాత్రనైనా అద్భుతంగా చేసే వెర్సటైల్ యాక్టర్. ఆయన నా రోల్ మోడల్. చోటాగారి ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. భరద్వాజ గారితో కలిసి చాలా సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. కిషోర్ గారు చాలా పాజిటివ్ పర్సన్. డైరెక్టర్ వంశీ గారికి థాంక్యూ. కార్తీక్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
డైరెక్టర్ వంశీకృష్ణ అఖిల మాట్లాడుతూ: నా ఫస్ట్ సినిమా హీరో జగపతి బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, చోటా కె. నాయుడు గారు, నిర్మాత కిషోర్ గారు.. ఈ నలుగురే ఈ సినిమాకి నాలుగు స్తంభాలు. వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. దర్శకుడిగా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. ఈ సినిమా ఐడియా జగపతి బాబు గారిదే. ఆయన ఐడియాపై నేను వర్క్ చేశాను. పేరుకు నేను డైరెక్టర్ అయినా… నా కంటే ముందు డైరెక్టర్ జగపతి బాబు గారు, తర్వాత భరద్వాజ గారే. వారు చెప్పిన మార్పులు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చోటా గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఆయన విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీ. కిషోర్ గారు చాలా జెన్యూయిన్ పర్సన్. లయ, హృతిక ఇద్దరూ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరూ పోటీగా నటించారు. కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. జగపతి బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, చోటా కె. నాయుడు గారు, నిర్మాత కిషోర్ గారు.. ఈ నలుగురితో విడివిడిగా సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమాలో జగపతి బాబు గారి ఇన్‌వాల్వ్‌మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు ఆయన ఎంతో సహకారం అందించారు. చోటా కె. నాయుడు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు కూడా ఎంతో కష్టపడ్డారు. సినిమా చరిత్రలో కెమెరామెన్, హీరో, ఎడిటర్ కలిసి ఇలా పని చేసిన సినిమా ఇదే అయి ఉంటుంది. హృతిక ఈ సినిమాలో భయపెట్టేసింది. లయ అద్భుతంగా నటించింది. డైరెక్టర్ వంశీ సినిమాను చాలా చక్కగా తీశాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటే మీడియా, ప్రేక్షకులు ఆశీర్వదిస్తేనే ఉన్నా.ను మళ్ళీ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను.
నిర్మాత కిషోర్ నాయుడు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నేను ఎంతో మంది మంచి మనుషులను సంపాదించుకున్నాను. హృతిక ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. లయ గారు చాలా సపోర్ట్ చేశారు. జగపతి బాబు గారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో. ప్రొడ్యూసర్‌కు ఖర్చు కాకూడదని ఆయన ఆలోచిస్తారు. చోటా గారు హాలీవుడ్ రేంజ్ డీఓపీ. ఆయన వల్లే మా సినిమా రేంజ్ పెరిగింది. డైరెక్టర్ వంశీతో పని చేయడం మంచి అనుభవం. భరద్వాజ గారితో పని చేసిన తర్వాత ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయాను. సినిమా సక్సెస్‌తో మీ రుణం తీర్చుకుంటామని నమ్ముతున్నాను.
డీఓపీ చోటా కె. నాయుడు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. బయట చాలా వేడి ఉంది… కానీ మా టీజర్ మీ అందరిని కూల్ చేసిందని అనుకుంటున్నాను. నేను మాత్రం టీజర్ చూసాక హై టెంపరేచర్‌లో ఉన్నాను (నవ్వుతూ). భరద్వాజ గారికి, జగపతి బాబు గారికి, డైరెక్టర్ వంశీకిమ అందరికీ థాంక్యూ.
హృతిక శ్రీనివాస్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. టీజర్ చూసిన వెంటనే మాటలు రాలేదు. అంత అద్భుతంగా ఉంది. క్రెడిట్ జగపతి బాబు గారికి, డైరెక్టర్ వంశీ గారికి, భరద్వాజ గారికి చెందుతుంది. లయ గారు స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించారు. కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే… సినిమాలో ఇంకా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా చూడటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ: చాలా ఆనందంగా ఉంది. గత పది రోజులుగా అహర్నిశలు కష్టపడ్డాం. భరద్వాజ గారు ఎప్పటిలాగే ఎంతో హార్డ్‌వర్క్ చేశారు. మా టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. డైరెక్టర్ వంశీ గారికి, చోటా గారికి ధన్యవాదాలు. జగపతి బాబు గారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా అదృష్టం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.
తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ
రచయిత: లక్ష్మీ భూపాల
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ
DOP: చోటా కె నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఆర్ట్ డైరెక్టర్: బజ్జా బ్రమయ్య
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం
ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ
పబ్లిసిటీ డిజైన్: కృష్ణా డిజిటల్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









