పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- April 27, 2026
మచిలీపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఛైర్మన్ అరవిందర్ సింగ్ షాని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ఛైర్మన్ సంజయ్ ఖన్నా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) ఛైర్మన్ వికాస్ కౌశల్‌లతో తాను నేరుగా మాట్లాడినట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఈరోజు, రేపటిలో పెట్రోల్, డీజిల్ సరఫరా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడిన అనంతరం పరిస్థితి సుమారు 90 శాతం వరకు పరిష్కారమైందని సమాచారం అందిందని బాలశౌరి తెలిపారు. రేపటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి సాధారణ సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ మరియు మైనింగ్ ఆపరేటర్లు కమర్షియల్ అవుట్లెట్లకు బదులుగా రిటైల్ అవుట్లెట్ల నుంచి ఇంధనం పొందడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం వాహనాలకు నిర్దిష్ట పరిమితులు విధించి సరఫరాను క్రమబద్ధీకరించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందన్నారు.
అనవసర ఆందోళనలు, అపోహలకు లోనుకాకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు ఆయిల్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







