కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- April 28, 2026
కువైట్: కువైట్ లో నియంత్రిత రంగాల నుండి కార్మికుల బదిలీకి అసలు యజమాని ఆమోదం తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఫస్ట్ ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిర్ణయం ప్రకారం.. యజమానులు మరియు కార్మికుల ప్రయోజనాలను బ్యాలన్స్ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్, ఇంజనీర్ రబాబ్ అల్-ఒసైమీ అన్నారు.
మే నెల ప్రారంభం నుండి జూన్ నెలాఖరు వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం, అసలు యజమాని నుండి తప్పనిసరి ఆమోదంతో సహా నిర్దిష్ట షరతులకు లోబడి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, పశు మరియు మత్స్య పరిశ్రమ వంటి రంగాల నుండి బదిలీలను అనుమతిస్తుంది.
అయితే, ఇది తాత్కాలికమైనది మరియు కఠినమైన నియంత్రణలకు లోబడి ఉంటుంది కాబట్టి, ఈ బదిలీలకు సంబంధించిన కార్మిక ఫిర్యాదులను అథారిటీ స్వీకరించదని అల్-ఒసైమీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







