ఖతార్‌లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!

- April 30, 2026 , by Maagulf
ఖతార్‌లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!

దోహా: ఖతార్ లో ఈ వారంతంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో భారీ అలలు మరియు దుమ్ముతో కూడిన పరిస్థితులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఖతార్ వాతావరణ శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌  షేర్ చేసింది.

ఇక నేడు పగటిపూట వాతావరణం వేడిగా ఉంటుందని, అక్కడక్కడ ఆకాశం మేఘావృతమైన ఉంటుందని, అప్పుడప్పుడు దుమ్ముతో కూడిన గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజులపాటు కూడా ఇదే తీరుగా వాతావరణ ఉంటుందని తెలిపింది.

ఉష్ణోగ్రతలు కనిష్టంగా 26°C నుండి గరిష్టంగా 37°C మధ్య నమోదవుతాయని వివరించింది. ఈ వారాంతంలో గంటకు 30 నాట్ల వేగం వరకు వీచే బలమైన వాయువ్య గాలులు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే సముద్రంలో అలల ఎత్తు కనిష్టంగా 2 అడుగుల నుండి అప్పుడప్పుడు 9 అడుగుల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com