బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- April 30, 2026
మనామా: బుదైయాలో 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని హత్య చేసి ఇద్దరు ఆసియన్లకు జీవిత ఖైదు విధించారు. 25, 28 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు వ్యక్తులు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
2025 డిసెంబర్ 28న నార్తర్న్ గవర్నరేట్‌లో నిందితుల తమ జాతీయతకే చెందిన వ్యక్తిని హత్య చేశారు. దాదాపు రెండు నెలల పాటు అతని కదలికలను గమనించి హత్యకు పాల్పడ్డారని విచారణలో గుర్తించారు.
ఒక ఫిర్యాదు అందిన తర్వాత తాను సంఘటనా స్థలానికి వెళ్లగా, బాధితుడు రక్తంతో తడిసి నేలపై పడి ఉండటాన్ని చూశానని ఒక పోలీస్ దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. సమీపంలోని ఒక ఇంటి సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు తెలిపారు.
హత్య అనంతరం కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









