పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- April 30, 2026
యూఏఈ: మిడిలీస్టు సంఘర్షణ కొనసాగుతుండటం కారణంగా ఏర్పడిన ప్రపంచ మార్కెట్ అస్థిరత నేపథ్యంలో యూఏఈ మే నెలకు సంబంధించిన ఇంధన ధరలను ప్రకటించింది. మారిన ధరలు మే 1న నుంచి అమల్లోకి వస్తాయి.
ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు Dh3.66గా నిర్ణయించారు. ఏప్రిల్‌లో ఇది Dh3.39గా ఉంది.
స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.55గా ఉండనుంది. ప్రస్తుత ధర Dh3.28గా ఉంది.
E-Plus 91 పెట్రోల్ ధర లీటరుకు Dh3.48గా నిర్ణయించారు. ఇప్పుడు లీటరుకు Dh3.20 గా ఉంది.
డీజిల్ ధరలో మార్పులు చేయలేదు. లీటరుకు Dh4.69గా కొనసాగనుంది.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణ మరియు 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు దాదాపు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉండేలా 2015లో యూఏఈలో పెట్రోల్ ధరలపై నియంత్రణలను (deregulation) తొలగించారు.
ఇదిలా ఉండగా, మే 1 నుండి OPEC మరియు OPEC+ ల నుండి యూఏఈ వైదొలగనుంది. ఈ సంస్థలో ఆరు దశాబ్దాల పాటు సభ్యదేశంగా యూఏఈ కొనసాగింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిమితులకు లోబడి 30 శాతం వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామం నేపథ్యంలో చమురు మార్కెట్‌లో మూడు రకాల ఫలితాలు సంభవించే అవకాశం ఉంది. మొదటిది, రోజుకు 2,00,000 నుండి 3,00,000 బ్యారెళ్ల చొప్పున చమురు సరఫరాను క్రమంగా పెంచడం వల్ల ధరలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. రెండవది, హోర్ముజ్ జలసంధి గుండా రవాణా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత, రోజుకు 500,000 నుండి 1 మిలియన్ బ్యారెళ్ల వరకు సరఫరాలో మితమైన పెరుగుదల ధరల పెరుగుదలను పరిమితం చేయగలదు. ఒకవేళ సరఫరా రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువగా పెరిగితే ధరలు పడిపోవచ్చు. దీర్ఘకాలంలో దీని ప్రభావం వాస్తవ సరఫరాతో పాటు మార్కెట్ సెంటిమెంట్‌పై కూడా ఆధారపడి ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
ఒపెక్ సాంప్రదాయకంగా మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి అదనపు సామర్థ్యంపై ఆధారపడిందని, కాబట్టి ఒక ప్రధాన భాగస్వామి అయిన యూఏఈని కోల్పోవడం అంచనాలను నిర్దేశించే దాని సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









