ప్రార్థన పేలవ ఆటతీరు భారత్ విజయావకాశాల్ని దెబ్బతీసింది..
- August 06, 2016
బ్రెజిల్లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్‌కు టెన్నిస్ విభాగంలో వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత్ తరఫున బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి చైనా క్రీడాకారిణులు జంగ్- పెంగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. సానియా మీర్జా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నా ప్రార్థన పేలవ ఆటతీరు భారత్ విజయావకాశాల్ని దెబ్బతీసింది. దీంతో మ్యాచ్‌ను సానియా జోడి 6-7, 5-7, 7-5 తేడాతో చేజార్చుకుంది. ఇక టెన్నిస్‌లో భారత్ ఆశలు సానియా మీర్జా- రోహన్ బోపన్న పోటీపడనున్న మిక్స్డ్ డబుల్స్పైనే ఉన్నాయి. ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో పేస్- బోపన్నల జోడి తొలి రౌండ్లోనే ఓటమిపాలైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







