అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- May 06, 2026
రియాద్ః లైసెన్సు లేకుండా వైద్య వృత్తిని కొనసాగించినందుకు, అనధికార గర్భస్రావ ప్రమోటింగ్ డ్రగ్ కేసులో దోషిగా తేలిన ఒక ప్రవాసికి ఆరు నెలల జైలు శిక్ష మరియు SR 100,000 జరిమానా విధించారు. 'వైద్య వృత్తుల నిర్వహణ చట్టం' (Law of Practicing Healthcare Professions) మరియు దాని నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, అనధికారికంగా గర్భస్రావానికి మెడిసిన్ ను విక్రయానికి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహించినట్లు పేర్కొంది.
రియాద్ ప్రాంతంలో వైద్యపరమైన నిబంధనల ఉల్లంఘనదారుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. లబ్ధిదారుల భద్రతను కాపాడటానికి మరియు ఆమోదించబడిన ఆరోగ్య నిబంధనల అమలును నిర్ధారించడానికి చేపట్టిన నిరంతర పర్యవేక్షణ ప్రయత్నాలలో భాగంగా జరిగిన తనిఖీ సమయంలో ఈ కేసు బయటకు వచ్చిందన్నారు. ఏవైనా ఉల్లంఘనల గురించి తెలిస్తే..కాల్ సెంటర్ నంబర్ 937 ద్వారా తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







