యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- May 06, 2026
మనామాః ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ లో యుద్ధంతోపాటు మిడిలీస్టులో ఉద్రిక్తతలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా , ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు కింగ్ హమద్ మనామాలో జెలెన్స్కీకి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రిన్స్, ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను వారు సమీక్షించారు. ఇటీవల ఇరాన్, బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాలపై జరిపిన దాడుల నేపథ్యంలో జెలెన్స్కీ బహ్రెయిన్‌కు చూపిన సంఘీభావానికి కింగ్ హమద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతిని సాధించేందుకు చర్చలు, దౌత్యనీతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు బహ్రెయిన్ మద్దతుగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







