అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు..40 మంది పోకిరీలు చుట్టుముట్టి..
- May 06, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్‌లోకి దిగి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఆమె దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మే 5, మంగళవారం అర్ధరాత్రి ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు.
అర్థరాత్రి ఆపరేషన్
హైదరాబాద్ మహిళా పోలీస్ కమిషనర్ సుమతి..బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్నగర్ బస్టాండ్‌కు అర్ధరాత్రి ఒంటరిగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లారు. మహిళా కమిషనర్‌గా కాకుండా.. ఒక సగటు మహిళగా బస్టాండ్‌లో బస్సు కోసం నిల్చున్నారు సుమతి. అయితే ఆమె కమిషనర్ అని తెలియక.. సగటు మహిళను ఎలా ఇబ్బందులకు గురి చేస్తారో, అలానే సుమతిని కూడా వేధించారు పోకిరీలు.ఈ ఆపరేషన్‌లో ఆమె సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులను స్వయంగా ఎదుర్కొన్నారు.
40 మంది పోకిరీల వేధింపులు
బస్సు కోసం ఎదురు చూస్తున్న సుమతిని సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. రకరకాల అసభ్య ప్రశ్నలతో ఆమెను వేధించారు. అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతి ఈ ఆపరేషన్ నిర్వహించారు.ఆమెను చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే కావడం గమనార్హం. అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులే అధికంగా ఉన్నారు. 3 గంటల పాటు పెట్రోలింగ్ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
అయినా సరే మొక్కవోని ధైర్యంతో సుమతి అక్కడే ఉండి అందరినీ గమనించారు. చివరికి తెల్లవారుజామున 3:30 గంటలకు అటువైపుగా ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చాడు. దీంతో పోకిరీలు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు.
మూడు రోజుల పాటు నిఘా
దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితుల పరిశీలన చేపట్టారు.
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకల ఆగడాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









