IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- May 07, 2026
ఐపీఎల్ జట్లు,ఆటగాళ్ల వెంట “అనధికార వ్యక్తులు” తిరుగుతున్నారనే నివేదికల పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా స్పందించారు. బోర్డు ఈ విషయంలో చూస్తూ ఊరుకోబోదని, అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అనధికార వ్యక్తులు జట్టు సభ్యులతో కలిసి బస్సుల్లో ప్రయాణించడం, హోటల్ గదుల్లోకి అనుమతి లేకుండా రావడం వంటివి గమనించామని ఆయన తెలిపారు.మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ మైదానంలోకి అడుగుపెట్టడం నిబంధనల ఉల్లంఘనే అని బీసీసీఐ పేర్కొంది.
గత నెలలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి జరిగిన కొన్ని ఘటనలను సైకియా గుర్తుచేశారు.గువాహటిలో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో మొబైల్ వాడినందుకు టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు రూ.1 లక్ష జరిమానా, హెచ్చరిక జారీ చేశారు.పంజాబ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ (Vaping) తాగుతూ కనిపించిన విషయాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించింది.
జట్టు యజమానులు మరియు అధికారులు ఆటగాళ్ల కోసం కేటాయించిన పరిమిత ప్రదేశాల్లోకి (PMOA) రావడంపై సైకియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది “డగౌట్ పవిత్రతను”, జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ అవకతవకలను అరికట్టేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి త్వరలోనే ఒక సలహా మార్గదర్శకాన్ని (Advisory) జారీ చేయనున్నాయి.ఇకపై ఎలాంటి ఉల్లంఘన జరిగినా, బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని సైకియా తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









