ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- May 07, 2026
మనామా: బహ్రెయిన్ లో ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపునకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్నబీ సల్మాన్, మమ్దూహ్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైఖ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు.
న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిక్రీ-లా నెం. 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







